షార్ట్ సర్క్యూట్…100 ఎకరాల పంట బూడిద
మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు క్షణాల్లో విస్తరించి సమీపంలోని గణేష్పల్లి గ్రామ పరిధిలోని వ్యవసాయ భూములను అంటుకున్నాయి. ఈ ఘటనలో సుమారు 100 ఎకరాల మేరకు ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు, విద్యుత్ తీగల్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు మొదలై వేగంగా వ్యాపించాయి. అప్పటికే కోతకు సిద్ధంగా...