శంకరన్న కుటుంబానికి అండగా ఉంటాం: సీఎం
మన భారత్ ,హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ బలవన్మరణం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన, శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆకస్మిక మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ఈ క్లిష్ట సమయంలో ధైర్యం,...