ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై వెంటనే స్పందించాలి
మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) కార్మికులు చేపట్టిన సమ్మెపై TSDF తీవ్రంగా స్పందించింది. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని TSDF చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, సంస్థ పరిరక్షణతో పాటు ఉద్యోగ భద్రత కోసం జరుగుతున్న పోరాటమని TSDF స్పష్టం...