ఉత్తమ విద్యార్థులకు సన్మానం..
మన భారత్, జాజాపూర్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జాజాపూర్‌లో గురువారం తల్లిదండ్రుల సమావేశం సందర్భంగా ఉత్తమ విద్యార్థుల అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి, ఆదర్శ కమిటీ చైర్మన్ మణెమ్మ కిరీటాలు ధరింపజేసి, ప్రగతి పత్రాలు, బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా పోటీతత్వంతో చదువులో ముందుకు రావాలని...