భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.!
మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చెన్న సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబిస్తూ ఆకట్టుకుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మొగుళ్లపల్లి ఎంఈఓ లింగాల కుమారస్వామి, గ్రామ సర్పంచ్ నరహరి వెంకటరెడ్డి హాజరయ్యారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ప్రేక్షకులను అలరించారు. ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం...