హత్య కేసులో నిందితుడి అరెస్ట్ ..
మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో చోటుచేసుకున్న హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయాన్ని చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ యాదవ్, మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ వెల్లడించారు. బుధవారం మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను అధికారులు తెలియజేశారు. రంగాపురం గ్రామానికి చెందిన చిలువేరు పోశయ్య (66)పై పాత కక్షల నేపథ్యంలో ఏప్రిల్ 4, 2026న...