గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూసేకరణపై రైతుల ఆందోళన
మన భారత్, మొగుళ్ళపల్లి: నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం చేపడుతున్న భూసేకరణలో అన్యాయం జరుగుతోందని మొగుళ్ళపల్లి మండల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను అక్రమంగా అరెస్టు చేసి, పోలీసుల సహాయంతో బలవంతంగా భూముల్లోకి ప్రవేశించి భూసేకరణ చేపడుతున్నారని వారు ఆరోపించారు. మండల కేంద్రంలో ఉన్న భూములకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించకుండా తక్కువ ధర నిర్ణయించడం అన్యాయమని రైతులు పేర్కొన్నారు. సమీపంలోని నవాబుపేట గ్రామంలో ఎకరాకు రూ.27.50 లక్షలు...