ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు
మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం రాత్రి ప్రభుత్వం మరియు కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు. అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర, ఖమ్మం డిపోల్లో ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కార్మికులు డిపోల ఎదుట కూర్చొని నిరసనలు వ్యక్తం...