రైళ్లలో మగవారికి ఉచిత ప్రయాణం..!
మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలపై ఆలోచిస్తోంది. నగరవ్యాప్తంగా నడిచే ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ప్రతిపాదన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణం అందించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ పథకాన్ని జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రారంభించేలా చర్యలు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్...