డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు షురూ.!
మన భారత్, తెలంగాణ: బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు తమకు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ ద్వారా డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర విద్యాసంస్థల్లో ఇంటర్ పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సిందిగా సూచించారు....