ఆర్టీసీ యంత్రాలకు నెట్వర్క్ సమస్య..
మన భారత్, ఆదిలాబాద్: ఆర్టీసీలో ప్రయాణికులకు టికెట్లు జారీ చేయడానికి ప్రవేశపెట్టిన టికెట్ ఇష్యూ యింగ్ మిషన్లు (TIM) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సమస్యలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన నెట్వర్క్ సౌకర్యం లేకపోవడంతో ఈ యంత్రాలు సక్రమంగా పనిచేయక కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్ల కొరత కారణంగా TIM యంత్రాలు పనిచేయకపోవడంతో కటాఫ్ పాయింట్లలోపు టికెట్లు జారీ చేయడం కష్టంగా మారింది. దీంతో తనిఖీ అధికారుల ముందు కండక్టర్లు...