వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం..
మన భారత్, ధన్వాడ: రైతుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ సదాశివరెడ్డి సూచించారు. శనివారం ధన్వాడ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రైతులు తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరకు విక్రయించుకోవాలని కోరారు. మధ్యవర్తులను ఆశ్రయించకుండా ప్రభుత్వ సౌకర్యాలను ఉపయోగించుకోవడం...