ఆ పథకానికి దరఖాస్తుల గడువు పొడిగింపు..
మన భారత్, ఆదిలాబాద్ : షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా అమలు చేస్తున్న పశుపోషణ పథకానికి దరఖాస్తుల గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆసక్తి గల ఎస్సీ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ పథకం ద్వారా పశుసంవర్ధక రంగంలో ఉపాధి అవకాశాలను పెంపొందించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కలెక్టర్ పేర్కొన్నారు....