అనుమానంతో కొడుకును హత్య చేసిన తండ్రి.!
మన భారత్, విజయపుర: కుమారుడికి తన పోలికలు రాలేదన్న అనుమానంతో ఓ తండ్రి తన సొంత బిడ్డ ప్రాణాలు తీశాడు. కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా నాగఠాణె గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లికార్జున, భాగ్యశ్రీ దంపతులకు సిద్ధార్థ (6) అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. అయితే బాలుడు తన పోలికలు లేవన్న అనుమానం మల్లికార్జునకు గత ఏడాదిన్నరగా వేధిస్తోంది. ఈ అనుమానంతో అతను మానసికంగా అసహనానికి లోనయ్యాడు. మార్చి 16న కుమారుడిని...