అంబేద్కర్ జయంతి సుంకిడిలో అన్నదానం.!
మన భారత్, తలమడుగు: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని సుంకిడి గ్రామంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో స్థానిక యువత, గ్రామస్తులు కలిసి అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు. అంతర్రాష్ట్ర రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు, ప్రయాణికులకు అన్నదానం చేసి నీటి బాటిళ్లను పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది. వేడికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దాహార్తి నివారణకు ఈ సేవ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా మారింది....