అంబేద్కర్ మార్గంలో నడవాలి: సర్పంచ్
మన భారత్, తలమడుగు: రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉండం గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోండ్ల మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ, సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య ప్రాముఖ్యతను పెంపొందించడానికి అంబేద్కర్ చేసిన కృషి అపారమని తెలిపారు. ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ...