బాలామృతంతో పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం
మన భారత్, మొగులపల్లి: అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే బాలామృతం పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలంలోని పర్లపల్లి సెక్టార్ పరిధిలోని పెద్దకోమటిపల్లి అంగన్వాడీ కేంద్రంలో సోమవారం బాలామృతం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుజాత మాట్లాడుతూ, 6 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు, అలాగే కిశోర బాలికలకు బాలామృతం మరియు చిక్కి ప్యాకెట్లను...