టెక్స్టైల్ రంగంలో తెలంగాణ నెంబర్ వన్ :సీఎం
మన భారత్, హైదరాబాద్: టెక్స్టైల్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా నిర్వహించిన ఏషియన్ టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, టెక్స్టైల్స్ రంగ ప్రముఖులకు తెలంగాణ, హైదరాబాద్ తరఫున హృదయపూర్వక స్వాగతం పలికారు. భారతదేశానికి అత్యుత్తమ వస్త్రాల తయారీలో గొప్ప చరిత్ర ఉందని, శతాబ్దాలుగా కళలు, సంస్కృతి, సంప్రదాయాలు టెక్స్టైల్ రంగాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దాయని తెలిపారు....