అధికారులను నిలదీసిన గ్రామస్తులు.!
మన భారత్, తలమడుగు : తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం ప్రజా సమస్యలతో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు పాల్గొని గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు. సమావేశంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై అధికారులు వివరాలు అందించారు. ముఖ్యంగా ఉచిత బస్సు సేవ, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, షాదీ ముబారక్ వంటి...