మీ సేవ చార్జీల పెంపు.. సామాన్యులపై భారం
మన భారత్ తలమడుగు: రాష్ట్రంలో మీ సేవ (MeeSeva) సేవల చార్జీలను ప్రభుత్వం భారీగా పెంచడంతో సామాన్య ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు కనిష్టంగా రూ. 35గా ఉన్న సర్వీస్ ఛార్జీలను ఏకంగా రూ. 80కు పెంచుతూ ప్రభుత్వం తాజా జీవో జారీ చేసింది. ఈ పెంపుతో వివిధ సర్టిఫికెట్లు పొందేందుకు ప్రజలు మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఆదాయ, నివాస, కులం వంటి సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో ఈ...