అవ్వ గుండె దైర్యం.. 150 ఎకరాల భూదానం.!
మన భారత్, బజార్హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామానికి చెందిన భూస్వామి ఏనుగు ఆశాబాయి తనకు చెందిన 150 ఎకరాల భూమిని పేదలకు దానం చేస్తూ విశేషమైన సేవా కార్యక్రమానికి నాంది పలికారు. ఈ భూమిని మొత్తం 30 పేద కుటుంబాలకు రాసిచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో ఆశాబాయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని ఆమె కుమారుడు...