వైభవంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన
మన భారత్ , తలమడుగు: తలమడుగు మండలం సకినాపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల పాటు వైభవంగా సాగిన ఈ ఆధ్యాత్మిక వేడుకలు గ్రామంలో భక్తి భావాన్ని నింపాయి. విగ్రహ ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని గ్రామంలో 21 రోజులపాటు ప్రత్యేక నియమ నిష్ఠలతో హనుమాన్ దీక్షలు నిర్వహించారు. ఈ కాలంలో గ్రామస్తులు మద్యం, మాంసాహారం త్యజించి, పాదరక్షలు ధరించకుండా సంప్రదాయాలను కచ్చితంగా పాటించారు. గ్రామానికి...