రైతు ఆత్మహత్యపై ఆగ్రహం:
మన భారత్ ఆదిలాబాద్: రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మండల కన్వీనర్ వెంకన్న మాట్లాడారు. రాష్ట్రంలో పండిన పంటలను సకాలంలో కొనుగోలు చేయకపోవడం, రైతుబంధు నిధులు విడుదలలో ఆలస్యం వంటి అంశాలతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. అకాల వర్షాల కారణంగా పంట...