వంటగ్యాస్ బుకింగ్ గడువు మళ్లీ పెంపు!
మన భారత్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు గ్యాస్ బుకింగ్‌కు సంబంధించి కొత్త నియమాలను అమలు చేస్తున్నాయి. ఈ నిర్ణయం కారణంగా వినియోగదారులు ముందుగానే బుకింగ్ చేయకుండా నిర్ణీత గడువు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో కొనసాగుతున్న పరిస్థితులు, ముఖ్యంగా యుద్ధ ప్రభావంతో సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరగడంతో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఈ ప్రభావం హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లపై కూడా పడింది. చాలా చోట్ల వ్యాపారాలు నిలిచిపోయే...