స్వయంభు వినాయక ఆలయంలో చోరీ..
మన భారత్: అదిలాబాద్: అదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న స్వయంభు గణపతి ఆలయంలో చోరీ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఆలయంలోని హుండీని దుండగులు పగలగొట్టి నగదు అపహరించినట్లు భక్తులు గమనించారు. బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు హుండీ దొంగతనం జరిగినట్లు గుర్తించి వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయ కమిటీ సభ్యులు జాదవ్ శ్రావణ్ నాయక్, భాస్కర్ గౌడ్ వెంటనే 100...