వాడని డేటా వృథా కాకూడదు.. రాఘవ్ చద్దా
మన భారత్, న్యూఢిల్లీ: టెలికం రంగంలో వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారితీసే అంశాన్ని ఆప్ ఎంపీ Raghav Chadha పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘డైలీ డేటా లిమిట్’ విధానం వల్ల వినియోగదారులు నష్టపోతున్నారని, వాడని డేటా అర్ధరాత్రితో ముగియడం అన్యాయమని ఆయన గళమెత్తారు. రాఘవ్ చద్దా మాట్లాడుతూ, వినియోగదారులు డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన డేటా పూర్తిగా వినియోగించుకోలేకపోతే, అది తరువాతి రోజుకు బదిలీ (Data Rollover) అయ్యే విధంగా నిబంధనలు తీసుకురావాలని...