తీయటి మాటల ముసుగులో సైబర్ మోసం..
మన భారత్, హైదరాబాద్: ఇటీవల సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనల రూపంలో యువతను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు హెచ్చరికలు వెల్లువెత్తుతున్నాయి. “ఒంటరిగా ఉన్నారా? అందమైన అమ్మాయిలతో చాట్ చేయండి” అంటూ కనిపిస్తున్న యాడ్స్ వెనుక ప్రమాదకరమైన సైబర్ ఉచ్చు దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రకటనలు యువతలోని ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని రూపొందించిన హనీట్రాప్ పద్ధతిగా గుర్తించారు. వీడియోల్లో కనిపించే మహిళలు నిజమైన వారు కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...