గ్యాస్ బుకింగ్ పేరుతో కొత్త సైబర్ మోసం..
మన భారత్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ముఖ్యంగా ‘GAS BILL UPDATE APK’ వంటి హానికరమైన ఫైల్స్‌ను వాట్సాప్ ద్వారా పంపిస్తూ వినియోగదారులను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారుల ప్రకారం, ఈ APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తే మొబైల్‌లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా...