చలాన పెండింగ్‌లో ఉంటే లైసెన్స్ ఫ్రీజ్
మన భారత్, తెలంగాణ: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చలాన్లు చెల్లించకుండా వదిలేసే వాహనదారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. సకాలంలో చలాన్లు చెల్లించని వారికి డ్రైవింగ్ లైసెన్స్ (DL), వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)లను ఫ్రీజ్ చేసే విధంగా కొత్త నిబంధనలను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం, ఒక వాహనదారునికి ఏడాదిలో 5 కంటే ఎక్కువ చలాన్లు ఉండి, అవి చెల్లించకపోతే...