కాంగ్రెస్ నేతల ఉగాది వేడుకలు.!
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత మాట్లాడుతూ ఉగాది పండుగ మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక...