అంతర్రాష్ట్ర వాహనాల బదిలీ సులభతరం..
మన భారత్, న్యూఢిల్లీ : రాష్ట్రాల మధ్య వాహనాల బదిలీ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. అంతర్రాష్ట్ర వాహనాల బదిలీ సమయంలో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొత్త విధానాన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాన్ని మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటే ముందుగా ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ రవాణా కార్యాలయం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకోవాల్సి ఉంటుంది....