మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ: సీఎం రేవంత్ రెడ్డి
మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 6వ తేదీ నుంచి ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ పేరిట 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి Revanth Reddy ప్రకటించారు. అభివృద్ధి ప్రణాళికల అమలును వేగవంతం చేయడం, పరిపాలనలో పారదర్శకతను పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ పనితీరులో గణనీయమైన మార్పులు తీసుకురావాలని అధికారులకు...