ఫుట్‌బాల్ మైదానంలో విషాదం… షిల్లాంగ్ ఎంపీ రిక్కీ సింగ్కోన్ కుప్పకూలి మృతి
మన భారత్, మేఘాలయ: మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. షిల్లాంగ్ పార్లమెంట్ సభ్యుడు రిక్కీ సింగ్కోన్ ఫుట్‌బాల్ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతిచెందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సమాచారం ప్రకారం, మవ్లాయ్ మావివోంగ్ ప్రాంతంలో స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడేందుకు రిక్కీ సింగ్కోన్ వెళ్లారు. మ్యాచ్ మధ్యలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై మైదానంలోనే కుప్పకూలిపోయారు. వెంటనే స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కు తరలించగా అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో...