మార్చి 15లోపు పరిషత్ ఎన్నికలు నిర్వహించకపోతే రూ.450 కోట్ల నిధులు ప్రమాదంలో.?
మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో పరిషత్ ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ.450 కోట్ల నిధులు ఎన్నికల నిర్వహణతో అనుసంధానమై ఉండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూచనల ప్రకారం, మార్చి 15లోపు పరిషత్ ఎన్నికలు నిర్వహించకపోతే ఆ నిధులు విడుదలలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో విద్యార్థుల టెన్త్ ప్రీ-ఫైనల్ పరీక్షలు కొనసాగుతుండగా, మార్చి 14...