తెలంగాణకు 4.30 లక్షల ఇళ్లు కేటాయింపు.. బడ్జెట్ వికసిత భారత్ లక్ష్యంతోనే: కిషన్‌రెడ్డి
మన భారత్, తెలంగాణ: కేంద్ర బడ్జెట్‌పై జరుగుతున్న విమర్శలను కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఖండించారు. బడ్జెట్ ప్రకటనలను ఉచితాల కోసం మాత్రమే చేశారంటూ ప్రజల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఈ బడ్జెట్ ఎన్నికల కోసం కాదని, వికసిత భారత్ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని ఆయన స్పష్టం చేశారు. పీఎం ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 4.30 లక్షల ఇళ్లను కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దీని ద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలకు...