విమాన ప్రమాదంపై డీజీసీఏ కీలక ప్రకటన..
మన భారత్, మహారాష్ట్ర: మహారాష్ట్రలోని బారామతి విమాన ప్రమాదంపై డీజీసీఏ (DGCA) వర్గాలు కీలక విషయాలను వెల్లడించాయి. ఈ ఘటన సమయంలో పైలట్ల నుంచి మేడే కాల్ (సహాయం కోరే అత్యవసర సంకేతం) అందలేదని డీజీసీఏ స్పష్టం చేసింది. ల్యాండింగ్ సమయంలో రన్‌వేను గుర్తించడంలో పైలట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపింది. డీజీసీఏ వర్గాల వివరాల ప్రకారం, బారామతి విమానాశ్రయం టేబుల్‌టాప్ రన్‌వే కేటగిరీకి చెందిందని వెల్లడించారు. ఇది సాధారణంగా ఎత్తయిన కొండ...