త్రాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
త్రాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు! మన భారత్, వరంగల్ జిల్లా: రెండేళ్లుగా త్రాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలు చివరికి రోడ్డెక్కి నిరసనకు దిగారు. ‘నీరు రావడం లేదు.. గోస పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ ఖాళీ బిందెలతో రోడ్డుపై నిలబడి తమ ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో రెండేళ్లుగా మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని మహిళలు ఆరోపిస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే...