ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు
ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యటన అంతర్‌రాష్ట్ర రహదారి పరిశీలనలో ప్రమాద స్థలాల గుర్తింపు మన భారత్, తాంసి, నవంబర్ 11: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ రూరల్, తాంసి, తలమడుగు మండలాల మీదుగా వెళ్లే అంతర్ రాష్ట్ర రహదారిపై పర్యటించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని రాంపూర్,తాంసి మండలంలోని పొన్నారి, హస్నాపూర్, అలాగే లక్ష్మీపూర్ (తలమడుగు మండలం) గ్రామాల పరిధిలో...