తేమ శాతం పేరుతో రైతులను దోచుకుంటున్న ప్రభుత్వాలు
మన భారత్, ఆదిలాబాద్:“ రైతులను దోచుకోవడం తప్ప ప్రభుత్వాలకు వేరే పనిలేదు” అని భారతీయ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూమా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గురువారం తాంసి మండల కేంద్రంలో భారతీయ సంఘ్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా భూమా రెడ్డి మాట్లాడుతూ, “సీసీఐ సంస్థలు పత్తి కొనుగోళ్లలో రైతులను నష్టపరుస్తున్నాయి. తేమ శాతం పేరుతో పత్తి బేళ్లను తిరస్కరించడం అన్యాయం....