హైస్కూల్లో అదనపు కలెక్టర్ తనిఖీ
మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 28: తాంసి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం అదనపు కలెక్టర్ సోమ రాజేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యకలాపాలు, మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను సమీక్షించారు. విద్యార్థులతో మాట్లాడిన అదనపు కలెక్టర్, వారి హాజరు వివరాలు, చదువుపై ఆసక్తి, బోధన విధానాలను తెలుసుకున్నారు. పాఠశాల సిబ్బందిని విద్యార్థుల శ్రేయస్సు, పాఠశాల పరిశుభ్రత, భద్రత అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు....