తెలంగాణ భాషా సాహిత్యానికి విశేష సేవలు.. ఉదారి నారాయణకు కాళోజీ స్మారక అవార్డు
వరంగల్‌లో అంపశయ్య నవీన్ చేతుల మీదుగా పురస్కారం ప్రదానం – రూ.10 వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేత మన భారత్ వరంగల్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ ఉదారి నారాయణకు ప్రతిష్ఠాత్మక కాళోజీ నారాయణరావు స్మారక అవార్డు లభించింది. శుక్రవారం వరంగల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేసిన ఈ అవార్డు కింద...