దేశం గర్వించేలా ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలి
తెలంగాణ ప్రతిష్టను జాతీయ స్థాయిలో చాటిచెప్పాలి.. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి: మంత్రి వాకిటి శ్రీహరి మన భారత్, హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణ రాష్ట్రానికి దక్కిన ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 నిర్వహణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశం గర్వించేలా పోటీలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులకు సూచించారు. ఈ క్రీడా పోటీల ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి...