రక్షణ రంగంలో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దుదాం
తెలంగాణను రక్షణ ఉత్పత్తుల తయారీకి అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, మన భారత్ ప్రతినిధి: రక్షణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, పరిశోధనా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రక్షణ అవసరాల కోసం విదేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తులు తయారు చేయడంతోపాటు వాటిని ఇతర దేశాలకు...