డీజేలకు అనుమతి లేదు.. అసత్య ప్రచారాలను నమ్మొద్దు
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్న డీఎస్పీ జీవన్ రెడ్డి ఆదిలాబాద్, సెప్టెంబర్ 17 (మన భారత్): గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజేలకు ఎలాంటి అనుమతి లేదని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. డీజేలకు అనుమతి మంజూరైందంటూ సామాజిక మాధ్యమాలు, వాట్సప్ గ్రూపుల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఆదిలాబాద్ సబ్‌డివిజన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా డీజేలను వినియోగించిన డీజే, వాహన యజమానులపై ఇప్పటివరకు 10 కేసులు నమోదు చేసినట్లు...