దళిత ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం..
ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుదాం అంటరానితనం, కుల వివక్ష ఆరోపణలపై చర్యలు తీసుకోవాలి: ఎస్సీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మెత నర్సయ్య మన భారత్, బజార్హత్నూర్: దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మెత నర్సయ్య అన్నారు. దళితులు నడిచిన ప్రజా రహదారిని ‘మైలైంది, అపవిత్రమైంది’ అంటూ పసుపు నీటితో శుద్ధి చేశారనే ఆరోపణలపై బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్సైకి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ...