విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యం: కలెక్టర్
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యం: కలెక్టర్ తలమడుగు, ఆగస్టు 24: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తూ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. సోమవారం తాంసి మండలం కపర్ల గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన “ఆరోగ్య పాఠశాల” కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు....