జాజాపూర్‌లో ఈక్వి-ల్యాబ్ ఫౌండేషన్ శిక్షణ కార్యక్రమం విజయవంతం
మన భారత్, జాజాపూర్, ఆగస్టు 21: విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనా విధానం, సమస్యలను గుర్తించి పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇన్‌క్వి-ల్యాబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆగస్టు 19, 20 తేదీల్లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాలుగు పాఠశాలలకు చెందిన విద్యార్థి నాయకులకు ప్రత్యేక శిక్షణ అందించారు. విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందించడంతో పాటు, తమ చుట్టూ...