ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు..
కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు.. సంప్రదాయ వాయిద్యాలతో ఆదివాసీ సంబరాలు మన భారత్, తలమడుగు | ఆగస్టు 9, తలమడుగు మండలంలోని దేహేగాం గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆదివాసీ ప్రజలు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరి సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా డప్పు, డోలు వాయిద్యాలతో గ్రామంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా గ్రామంలోని ఆదివాసీ జెండాగద్దె వద్ద కొమురం భీమ్ చిత్రపటానికి...