ఎయిర్‌పోర్ట్ పేరుతో రైతులను భయపెట్టొద్దు
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనపై ప్రభుత్వం వెంటనే అధికారిక స్పష్టత ఇవ్వాలి: రైతుల డిమాండ్ ఆదిలాబాద్, జూలై 24: ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్–ఎయిర్‌ఫోర్స్ ప్రాజెక్టు పేరుతో రైతులను పదేపదే అయోమయానికి గురిచేయడం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వెంటనే అధికారిక స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో జూన్ 2న ఎయిర్‌పోర్ట్‌కు భూమిపూజ జరుగుతుందని ప్రచారం జరిగిందని, అనంతరం వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల అవుతుందని వార్తలు రావడంతో...