బీటీ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
వడ్డాడి ప్రాజెక్టును పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.. గేట్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచనలు మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని వడ్డాడి ప్రాజెక్టును శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ప్రాజెక్టు గేట్లు, నిర్మాణ పరిస్థితులను పరిశీలించారు. ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతు పనులను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వడ్డాడి ప్రాజెక్టు రైతులకు, స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనదని...